Tuesday, November 17, 2009

శ్రీ సాయినాథాయ నమః
ఏకం అనేకమైనటువంటి ,అద్వైతసామ్రాట్ , అఖండసచ్చిదానందమూర్తి ,అఖిలాండకోటిబ్రహ్మాండనాయకుడు, శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గురించి వ్రాయటం చాలా సాహసకార్యమే .కుబ్జ నిండుపున్నమి చండ్రుడుని అందుకోవాలని ఆరాటపడినట్లుగా వుంటుంది .కాని ఏదో తెలియని ఉత్సాహం ఉసికోలిపి నాచే సాహస కార్యం చేయిస్తోంది .సాయి
గురుంచి అర్థం చేసుకున్నది అణువు ,అర్థం చేసుకోవాల్సింది అనంతం .

అనంతమైన కరుణాసముద్రుడిని అర్థం చేసుకొని ఆరాదించాలంటే అత్యంత కష్టసాధ్యమైన పని . ఆయన ఆరాధన అత్యంత సులభం అత్యంత దుర్లభం కూడా .సులభ మార్గాన్ని ఎన్నుకోలేక ఆయన ఆరాధన దుర్లభమని వాపొతాము . ద్వేషానురాగాలకు అతీతుడైన పరబ్రహ్మ షిర్డీ సాయినాథుడు . నిరాకారుడు,నిరంజనుడు,నిర్గుణుడు,సర్వాదారుడు, నిరాధారుదైనట్టి పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్ ని పూజించాలంటే అత్యంత నియమ నిష్ఠలతో కూడిన అంతరంగిక భక్తి చాల ముఖ్యం నిత్యం మనము చేసే బాహ్య పూజలు మన అంతరంగ శుద్ధికి సహాయ పడతాయి .

పరిశుద్ధమైన అంతరంగమందు సాయినాథ పరబ్రహ్మ తన సంపూర్ణ కృపాకటాక్షాలను మనమీద చూపిస్తాడు .అంతరంగ శుద్ధి అనేది అంత సులభమైన విషయం కాదు దానికి పరబ్రహ్మ ఐన సాయినాథుని తత్వాన్ని తెలుసుకొని , తత్వాన్ని తనలో జీర్ణించుకున్న భక్తుల సహాయ సాహచార్యమెంతో అవసరం .కాని సాయికి మనకు మధ్యన ఎటువంటి తెరలు అవసరం లేదని అనవచ్చు .

మనసులో నిండు కొన్న ఐహిక వాంఛ లనేది తెరలను తొలగించి అరిశాద్వార్గాలనేది కలుపు మొక్కలను పికి వేశి సాయిని మన మనసు నందు నిలిపే సాయి ఆంతరంగిక భక్తుడు మన కి అవసరం .

సాయి ప్రేరణ తోనే అటువంటి భక్తులు మన జీవితంలో ప్రవేశిస్తారని గాఢ నమ్మకం నాకు ఉన్నది .


పరబ్రహ్మ ను ప్రశంసించుట కు చదువుల తల్లి సరస్వతి బ్రహ్మాండాన్ని తల పత్రంగా చేసుకొని ,కల్పవృక్షం కొమ్మను కాలంగానూ ,మేరు పర్వతాన్ని సిరా బుడ్డి గాను ,అమృతాన్ని సిరా గాను చేసుకొని మొదలు పెట్టిందట .ఎంత వ్రాసిన తరుగ లేదుట .( విషయం పుష్పదంతుడి విరచిత మైన శివ మహిమన స్తోత్రం మందు వస్తుంది ).అంతటి పరబ్రహ్మ సాయి నాధుని అర్ధం చేసి కొనుట నా లాంటి సామాన్యురాలికి అసాధ్యమైన విషయం. అందుకే నా ప్రార్ధనకు సమాధానముగా శ్రీ నంజున్దేశ్వర గారిని నా జీవితం లో ప్రవేశింప జేసి వారిచే నా మనసును తన మీద లగ్న మగునట్లు చేసారు సాయి నాధ పరబ్రహ్మ.నాకు ఇటువంటి mahOpakaram చేసి నన్ను ధన్యురాలిని చేసిన శ్రీ నంజున్దేశ్వర గారి గురంచి కొన్ని మాటలు వ్రాస్తేనే నాకు తృప్తి కలుగు తుంది .

Sunday, November 15, 2009

ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోర్పదం
మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోర్కృపా
గణేశాయ నమః
సరస్వత్యై నమః
శ్రీ గురుభ్యో నమః
శ్రీ సాయినాథయతీంద్ర పరబ్రహ్మణే నమః